ETV Bharat / state

ప్రేమ.. 'బంధాలు, బాంధవ్యాలకు వారధి.. రెండు హృదయాల్లో సెలయేరులా పారేది' - వాలెెంటైన్స్​ డే

Happy Valentines Day 2023: ప్రేమ ఎన్నో భావోద్వేగాల కలయిక. హృదయాల వేదికగా సాగే జ్ఞాపకాల మజిలీ. ప్రేమించిన వారిని.. జీవిత భాగస్వామిగా పొందిన వారు ఎంతోమంది. దక్కించుకోలేక బాధపడుతున్న వారు మరి కొంతమంది. అయితే కొందరు ప్రేమికులు.. ప్రేమించిన వారికోసం జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను అధిగమించి నిలిచారు. వయసు, మతాల తారతమ్యాలు ఇలా ఎన్ని ఎదురైనా అవేవీ నిజమైన ప్రేమకు అడ్డుకాదని నిరూపించారు. ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం.

Happy Valentines Day
Happy Valentines Day
author img

By

Published : Feb 14, 2023, 10:00 AM IST

Updated : Feb 14, 2023, 10:29 AM IST

Happy Valentines Day 2023: ప్రేమ అనేది రెండు అక్షరాలకే పరిమితమైంది కాదు. రెండు క్షణాలతో అంతమయ్యేది అంతకన్నా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ బంధమూలేని తొలి సంబంధమే ప్రేమ. అది ఒక అనిర్వచనీయ అనుభూతి. ఓ సినీ కవి పేర్కొన్నట్టు..‘ప్రేమ దివ్యభావం..ప్రేమ దైవ రూపం’. ప్రేమను నిజంగా మనసుపెట్టి చూడగలిగితే, మనస్పూర్తిగా ఆస్వాదించగలిగితే ‘ఆది, అంతం లేని అమరానందమే’.

రెండు హృదయాల్లో సెలయేరులా పారుతుంది. అలసట తీర్చే చిరుగాలిలా మారుతుంది. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకున్నపుడు ప్రేమే జీవరాగమవుతుంది. ఆ ప్రేమే జ్ఞానయోగమూ అవుతుంది. ప్రేమతో ఇతరుల మనసులు గెలుచుకోవడమే గొప్ప. అలాంటి అపురూపమైన ప్రేమకు దాసులు కానివారు ఎవరుంటారు. ఎవరో ఒకరు... ఎపుడో అపుడు.. ఎక్కడో అక్కడ ప్రేమను ఆస్వాదించే ఉంటారు, అలాంటి అనుభూతిని అనుభవించే ఉంటారు.

Valentines Day 2023: ప్రేమ గుడ్డిది అంటారు. తమకు నచ్చినవారి ఆస్తులు, అంతస్తులను చూడకుండా వారి మనసును మాత్రమే అది నమ్ముతుంది. నిజమైన ప్రేమను నమ్మినవారు తమ జీవితభాగస్వామిని కూడా జీవితాంతం ప్రేమగా, నమ్మకంగా చూసుకుంటారు. ప్రేమను ప్రేమగానే చూడాలి. ప్రేమించడం అంటే బాహ్య సౌందర్యం చూసి ఒక అభిప్రాయానికి రావడం కాదు. జీవితాన్ని చక్కదిద్దుకునే సమర్థత కలిగి ఉండాలి.

ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు అంగీకరించకుంటే, తమ నడవడిక, జీవితంలో ఎదుగుదల వంటివాటితో వారిని తమ దారిలోకి తీసుకురాగలగాలి. ఎంతకాలం కలిసి ఉంటారు చూద్దాం అంటూ హేళన చేసినవారిని తలదన్నేలా తాము జీవితంతో చక్కగా స్థిరపడడంతోపాటు తమ పిల్లలు కూడా ఎంతో ఎత్తుకు ఎదిగేలా తీర్చిదిద్దిన వారూ ఉన్నారు. ఇలా.. బంధాలు, బాంధవ్యాలకు వారధిగా నిలిచే ప్రేమను.. ప్రేమగా ప్రేమించి తాము ప్రేమించిన వారిని ప్రేమగా చూసుకుంటూ, అప్పటి వరకు తమ నిర్ణయాలను అంగీకరించని ఇరు కుటుంబాల పెద్దల మనసులను తమ ప్రేమతో గెలిచిన కొందరి జంటల గురించి నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా...

కుమారులతో గన్నవరపు రాజశేఖర్‌, శారద దంపతులు, కోదాడ

అవాంతరాలకు కుంగిపోలేదు : 1993లో కుటుంబ సభ్యులను మెప్పించి పెళ్లి చేసుకున్నాం. పట్టణంలోని కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో చదివేటప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా ఒక్కటై ముందుకు నడిచాం. సమాజంలో అవాంతరాలు ఎదురైనా కుంగిపోలేదు. మా ఇద్దరు కుమారులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అందరికీ ప్రేమ పంచడం నేర్చుకుంటే జీవితంలో విజయవంతమవుతాం.

.

అన్యోన్య దాంపత్యం : మాది కులాంతర వివాహం. 1996లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆస్తులు, అంతస్తులు అడ్డు గోడలుగా నిలిచినా ఆమె నాచేయిపట్టి నడిచింది. కాల గమనంలో రెండు కుటుంబాలు మనస్పర్థలు వీడి ఒక్కటయ్యాయి. మూడు దశాబ్దాలుగా మా దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతోంది. ఉన్నంతలోనే ఇద్దరు కూతుళ్లకు మంచి చదువులు చెప్పించాం. మా దృష్టిలో ప్రేమ చాలా పవిత్రమైనది. బంధాలకు, బాంధవ్యాలకు వారధిగా నిలిచేది. అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చేదే ప్రేమ. తరాలు మారినా ఈ పదానికి అర్థం మారదు.

ఎర్రోజు యశ్వంత్‌చారి-కిరణ్మయి దంపతులు

అర్థం చేసుకుంటూ.. ముందుకు సాగుతూ : మోత్కూరు పురపాలికలోని ధర్మాపురం గ్రామానికి చెందిన ఎర్రోజు యశ్వంత్‌చారి-కిరణ్మయి ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నారు. ఒకే వీధిలో ఉండటంతో పరిచయాలు పెరిగి, ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2006లో అన్నవరం వెళ్లి ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులూ వీరి ప్రేమపెళ్లిని అంగీకరించలేదు. అయినా ధైర్యంగా వేరుగా ఉంటూ ఒకరికొకరు తోడుగా కొత్త జీవితం ప్రారంభించారు. 12 ఏళ్ల అనంతరం కిరణ్మయి తల్లిందండ్రులు అర్థం చేసుకుని వీరితో కలిమిడిగా దగ్గరయ్యారు. వీరికి కుమారుడు ప్రణయ్‌సూర్య(16), కూతురు రేణుశ్రీ(15)లు ఉన్నారు. యశ్వంత్‌చారి-కిరణ్మయి మాట్లాడుతూ ఒకర్ని ఒకరు అర్థం చేసుకుని ఉండటం వల్లే మనస్పర్థలు, అవాంతరాలు రాలేదన్నారు.

మనవడు, మనవరాలితో కందుల పాపయ్య, వెంకట్రావమ్మ

ఆ కుటుంబంలో అన్నీ ప్రేమ వివాహాలే : కోదాడ మండలం కొమరబండకు చెందిన కందుల పాపయ్య, వెంకట్రావమ్మలది ఒకే ఊరు. పాపయ్య దివ్యాంగుడు. కోదాడలోని ఓ థియేటర్‌లో పనిచేసేవారు. సినిమాకు వచ్చే క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అమ్మాయి తరుఫు వారు ఒప్పుకోకపోవడంతో 1982లో పెళ్లి చేసుకుని ఊరికి దూరంగా వెళ్లిపోయారు. మొదట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగారు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరివి ప్రేమ వివాహాలే.

.

* కందుల విక్రమ్‌ 2010లో హైదరాబాద్‌లో చదువుకుంటున్న సమయంలో ఉష పరిచయమైంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకొన్నారు. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ప్రస్తుతం అస్ట్రేలియాలో పనిచేస్తున్నారు.

.

* 2007లో ఉస్మానియాలో ఎంబీఏ చదువుతున్న కందుల మధుకు విజయలక్ష్మి పరిచయమైంది. అది ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో 2010లో పోలీస్‌స్టేషన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఒకరిమీద ఒకరికి నమ్మకంతో కట్టుబట్టలతో బయటకొచ్చామని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు లేవని చెబుతున్నారు.

లక్ష్మయ్య, ఉమారాణి జంట

ముఖం చెదిరినా : యాదగిరిగుట్టకు చెందిన లక్ష్మయ్య, ఉమారాణి జంట ప్రేమకే నిర్వచనంగా నిలుస్తున్నారు. వీరిద్దరు మొదట స్నేహితులు. కులాలు వేరు. ఉమకు మరొకరితో పెళ్లయింది. భర్త దాష్టికంతో ఆమెపై యాసిడ్‌ దాడి జరిగి అందమైనముఖం చెదిరిపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన ఆమె జీవితానికి వెలుగునిచ్చారు లక్ష్మయ్య. వీరికి ముగ్గురు సంతానం కలిగి ఉన్నతంగా ఎదిగారు.

విజయలక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి దంపతులు

రాష్ట్రాలు వేరైనా : చెన్నైకి చెందిన విజయలక్ష్మి, సూర్యాపేట వాసి శ్రీనివాస్‌రెడ్డి కులాలు, రాష్ట్రాలు వేర్వేరు కావడంతో పెద్దలు ప్రేమపెళ్లికి ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా 1992లో పెళ్లి చేసుకున్నారు. కళాశాలలో పని చేసి.. ఆ తర్వాత సూర్యాపేటలో పాఠశాలను నెలకొల్పి విజయవంతంగా రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కరస్పాండెంట్‌గా, విజయలక్ష్మి ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2023, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.