ETV Bharat / state

ఉండ్రుగొండ గిరులు.. పర్యాటక సిరులు - నల్గొండ జిల్లా వార్తలు

మిన్నంటే కొండలు.. లోతైన లోయలు.. పిల్లగాలుల సవ్వడులు.. ముసురులో తడిచిన కురుల నుంచి జాలువారే యేరుల సయ్యాటలు... ఏరులై పారిన నీటితో ఏర్పడ్డ నీటి కొలనులు... సూర్యరశ్మి కౌగిలిలో కొండలపై పసిడి వన్నెల తళుకులు ఇలాంటి సుందర దృశ్యాలతో పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తుంది ఉండ్రుగొండ.

undrugonda
undrugonda
author img

By

Published : Sep 27, 2020, 1:16 PM IST

కొండల మధ్య అందంగా ఉన్న కోనేరు

శతాబ్దాల చరిత్రకు ఆనవాళ్లు ఉండ్రుగొండ కొండలు

ప్రకృతి రమణీయత, సుందర దృశ్యాలతో ఉండే ఉండ్రుగొండ... ఎందరో రాజులు పరిపాలనాకేంద్రంగా చేసుకుని ప్రస్థానాన్ని కొనసాగించారు. అడిగిందే తడువుగా వరాలిచ్చే స్వయంభు లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు భక్తి పారవశ్యానికి ప్రతీకగా ఎన్నో ఆలయాలకు నిలయంగా నిలిచింది ఉండ్రుగొండ గిరిదుర్గం. వందల యేళ్ల చరిత్ర కలిగిన ఈ దుర్గం ప్రస్తుతం పర్యాటకులకు కనుల విందుగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు సమానదూరంలో సూర్యాపేటకు సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లా చివ్వెంల మండలంలో ఎనిమిది కొండలను కలుపుతూ సుమారు వెయ్యి ఎకరాల ఆభయారణ్యంతో నిరంతరంగా పచ్చని చీరకట్టు మాదిరిగా నిగనిగలాడుతూ ఉంటుంది. గిరులు సోయగం ప్రకృతి చేసిన అద్భుతంగా ఉంటుంది.

గిరిదుర్గంలో కొలువై ఉన్న స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

చరిత్ర

ఉండ్రుగొండ గిరిదుర్గం క్రీ.శ. 3 శతాబ్దం నుంచి రాజుల పరిపాలనలో కొనసాగింది. ఇక్కడ 3వ శతాబ్దంలో విష్ణుకుండినులు మొదలైన పరిపాలన అనంతరం 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు కళ్యాణచాళుక్యులు, కుందూరుచోళులు, రెచెర్ల నాయకులు, 13వ శతాబ్దంలో కాకతీయులు, 14వ శతాబ్దంలో గజపతిరాజులు, 15వ శతాబ్ధంలో శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ నుంచి పరిపాలన సాగించారు. 18వ శతాబ్ధంలో నిజాం నవాబు ఏలుబడి సాగించిన ఆనవాళ్లు ఉన్నాయి. వీరి మధ్య కాలంలో అప్పుడప్పుడు తమ సామంతులు సైతం ఉండ్రుగొండ గిరిదుర్గంలో నాయకత్వాన్ని చేపట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.

ఇన్ని శతాబ్దాలుగా పరిపాలన సాగించినట్లు గిరిదుర్గంలోని కట్టడాలు, ప్రాకరాలు, శిల్పాలు, శాసనాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. ఇలా ఉండ్రుగొండ చరిత్రను తవ్వినకొద్దీ పాతబంగారంలా.. దొరికే చరిత్ర భాండాగారంగా ఉంటుంది. ఇటీవల దొరికిన కొన్ని శాసనాల ఆధారంగా దుర్గంలోని కొలిమిచావిడి, ఏనుగుల దర్వాజా ప్రతాపరుద్రుని పరిపాలనలో ప్రత్యేకమైనవిగా సూచించబడుతున్నాయి. అప్పట్లో ప్రతాపరుద్రుడు తమ సేన నాయకులతో తమ ఆధీనంలో ఉన్న ప్రాంత సంరక్షణకై సమావేశానికై ఏర్పాటు చేసుకొన్నదే కొలిమిచావిడిగా నిర్ధారించబడింది. వీరు ఎక్కువగా శత్రుసైన్యంపైకి తమ సైన్యాన్ని ఏనుగులతో పంపించేందుకు ఏర్పాటు చేసుకొన్న ద్వారమే ఏనుగుల దర్వాజాగా బయల్పడింది.

ప్రపంచ పర్యాటక ఉత్సవాలు

నాగులపాటి దర్వాజ

ఉండ్రుగొండ గిరిదుర్గం చరిత్రకు అనుగుణంగా ఎన్నో చూడచక్కని కట్టడాలు, ప్రదేశాలు పర్యాటకులకు పసందుగా ఉన్నందున ఈ ప్రాంతాన్ని 2008లోనే అప్పటి ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. అనంతరం ప్రస్తుత ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు ఇక్కడ కొనసాగుతున్నాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుపనున్నట్లు జిల్లా పాలనాధికారి టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : సాగరహారం.. అద్భుత వరం.. పర్యాటకుల మణిహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.