ETV Bharat / state

సాగర్​కు కొనసాగుతున్న వరద ప్రవాహం - నల్గొండలో నాగార్జున సాగర్​ డ్యాం

నాగార్జునసాగర్​కు వరదప్రవాహం పెరుగుతోంది. ఆరు గేట్లు క్రస్ట్​ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్​ 6 క్రస్ట్​గేట్లు ఎత్తివేత
author img

By

Published : Oct 10, 2019, 11:18 AM IST

నాగార్జునసాగర్​ 6 క్రస్ట్​గేట్లు ఎత్తివేత

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్​కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు జలాశయం ఆరు క్రస్ట్​ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటినిల్వ 312 టీఎంసీలకు 311.74 టీఎంసీలకు చేరుకున్నందున ఆరు క్రస్ట్​ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ ఇన్​ఫ్లో 96 వేల 324 క్యూసెక్కులుండగా... ఔట్​ ఫ్లో లక్షా 5వేల 210 క్యూసెక్కులు ఉంది.

34 రోజులు

సాగర్​ నుంచి ఇప్పటివరకు 34 రోజులు దిగువకు నీటిని విడుదల చేశారు. 2009 తర్వాత సాగర్​ జలాశయం 26 గేట్లనూ ఎత్తడం ఈ సీజన్​లోనే కావడం విశేషం. ఖరీఫ్​ సీజన్​ ముగిసే వరకు జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం కొనసాగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.