నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాసవినగర్ కాలనీలో శ్రీ వాసవి అపార్ట్మెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఫ్లాట్ నెంబర్ 402లో రేపాల లక్ష్మీ-శ్రీనివాస్ దంపతులు ఉంటున్నారు. ఈరోజు ఉదయాన్నే లక్ష్మీ కాలుజారి నాలుగో అంతస్తు నుంచి కింద పడింది. తీవ్రగాయాల పాలైన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: సర్కార్ బడుల్లో చదువుల పండుగ...