నల్గొండ జిల్లాలో ఓ ఎస్సై రైతు పట్ల దురుసుగా ప్రవర్తించారు. హాలియా సహకార ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన రైతుపై చేయి చేసుకున్నాడు.
హాలియా ఉన్నత పాఠశాలలో పురుషులు, స్త్రీలకు ఒకే క్యూ లైన్ ఉండటం వల్ల తోపులాట జరిగింది. ఈ తోపులాటను నియంత్రించే క్రమంలో సహనం కోల్పోయిన ఎస్సై వీరరాఘవులు రైతుపై చేయి చేసుకున్నాడు.
ఎస్సై వీరరాఘవులు ప్రవర్తనపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన రక్షకభటుడి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాఘవులు మాత్రం తన చర్యను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.
ఇదీ చూడండి : రాజకీయ హత్య: సహకార ఎన్నికల వేళ రక్తం చిందించిన యర్కారం