ఎగువనుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో నాగార్జునసాగర్ కళకళలాడుతోంది. రెండు రోజులగా ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఇన్‌ప్లో 8 లక్షల 39 వేల 627 క్యూసెక్కులుగా ఉంది. 5 లక్షల 98 వేల 294 క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 579.90 అడుగులు కాగా నీటి నిల్వ 282.7264 టీఎంసీలుగా ఉంది. గరిష్ఠ నీటినిల్వ 312 టీఎంసీలు. 26 గేట్ల నుంచి కిందకు దూకుతున్న కృష్ణమ్మ పరవళ్లను వీక్షించేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు.
ఇదీ చూడండి:విత్తన బంధం ఈ రక్షా బంధనం