ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో నల్గొండ జిల్లా సాగర్ నూతన వంతెన వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద వాహన రాకపోకలను మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు.. అక్కడి నుంచి తెలంగాణకు పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అంబులెన్సులను ఎలాంటి అనుమతి లేకుండానే పంపిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.
కరోనా రెండో దశలో ప్రజలకు చాలా అవగాహన వచ్చిందని డీఎస్పీ వెల్లడించారు. అవసరం ఉన్న వాహనదారులు మాత్రమే పాసులతో రాకపోకలు జరుపుతున్నారని.. మిగతా వారు ఇళ్లకు పరిమితం అయ్యారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలను అభినందించాలన్నారు. ప్రజల సహకారం ఇలాగే ఉంటే కరోనాను జయించవచ్చన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 4,298 కరోనా కేసులు, 32 మరణాలు నమోదు