ETV Bharat / state

సాగర్​లో అభ్యర్థుల బలాలు, బలహీనతలు చూద్దామా - Nagarjunasagar latest news

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచార గడువు నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీల నేతలు నెల రోజులుగా సాగర్‌లోనే మకాం వేసి... ఓటర్ల ప్రసన్నానికి తీవ్రంగా శ్రమించారు. ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు వ్యూహా ప్రతివ్యూహాలతో... రాజకీయ వేడిని పెంచారు. నేటితో ప్రచారం ముగియనున్న తరుణంలో... అభ్యర్థుల బలాబలాలు, గెలుపు అంచనాలపై కథనం.

Sagar by election campaign ends today, nagarjunasagar by election news
సాగర్​లో అభ్యర్థుల బలాలు, బలహీనతలు చూద్దామా
author img

By

Published : Apr 15, 2021, 4:42 AM IST

Updated : Apr 15, 2021, 6:29 AM IST

ప్రజల్లో తమకు ఆదరణ తగ్గలేదని నిరూపించుకునే తపన ఒకరిది. పునర్వైభవం చాటుకునేందుకు ఇదే సరైన వేదికనే ఆశ మరొకరిది. అధికారంలోకి రాబోయేది తామేననే ధీమా ఇంకొకరిది. ఇలా... నాగార్జునసాగర్‌ ఉపఎన్నికతో రాష్ట్రంలో భవిష్యత్‌ ఎన్నికలకు ప్రధాన పార్టీలు బాటలు వేసుకుంటున్నాయి.

తెరాస బలాలు, బలహీనత

తెరాస నుంచి పోటీ చేస్తున్న నోముల భగత్... ఇంతకాలం తండ్రి చాటు తనయుడిగా ఉన్నారు. నర్సింహయ్య హఠాన్మరణంతో టికెట్ రేసులో... ఆయన పేరు తెరపైకి వచ్చినా... చివరి నిమిషం వరకు అభ్యర్థిత్వంపై దోబూచులాటే నెలకొంది. విపరీతమైన పోటీ మధ్య ఎట్టకేలకు భగత్... పోటీ చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. 50 శాతానికి పైగా బీసీలున్న సాగర్‌లో... అదే వర్గం నుంచి బరిలోకి దిగడం భగత్‌కు బలమని చెప్పాలి. యాదవ సామాజికవర్గానికి చెందిన ఆయన... తన సామాజిక వర్గ ఓట్లు పెద్దఎత్తున పోలవుతాయని భావిస్తున్నారు. సర్కారు సంక్షేమ పథకాలు... తెరాస అభ్యర్థికి బలమవుతున్నాయి. నెల్లికల్ ఎత్తిపోతలకు స్వయంగా ముఖ్యమంత్రి భూమి పూజ చేయటం, తిరుమలగిరి సాగర్ మండలంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమవటం... ఈ ఎన్నికల్లో కలసివస్తాయన్న భావన తెరాసలో ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలంతా కొన్నిరోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసి... భగత్‌ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. నెలన్నర నుంచి ఏడు మండలాల బాధ్యతల్ని... ఒక్కో చోట ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల చొప్పున పర్యవేక్షిస్తున్నారు. వీటన్నింటికి తోడు నిన్న కేసీఆర్... హాలియా బహిరంగసభకు హాజరుకావటం మరింత ఉత్సాహాన్ని నింపిందని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి.

నోముల భగత్

నోముల భగత్ బలహీనతల విషయానికి వస్తే... సాధారణ ఎన్నికల్లో తన తండ్రి నర్సింహయ్య వెంట ఉండి... ఆయన గెలుపులో కీలకపాత్ర వహించినా... నియోజకవర్గంలో పెద్దగా పరిచయాల్లేవు. కేవలం అభ్యర్థి సామాజికవర్గానికే... తెరాస అధిక ప్రాధాన్యమిస్తోందని జరుగుతున్న ప్రచారం... మిగతా బీసీ కులాల్ని నిరాశకు గురిచేస్తోంది. ఇక టికెట్ ఆశించి భంగపడిన నేతలు... తెరవెనుక తమ సామాజికవర్గానికి చెందిన ప్రత్యర్థికి సహకరిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అదే జరిగితే భగత్ ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. మరోవైపు యువకుడైన భగత్‌... ఎమ్మెల్యేగా గెలిస్తే... భవిష్యత్తులో తమకిక అవకాశమే ఉండదన్న భావన.... తెరాసకు చెందిన కొందరు నేతల్లో అసంతృప్తి రాజేస్తోంది. ఇలాంటి అంశాలు భగత్‌కు బలహీనతలుగా తయారయ్యే ప్రమాదముంది.

కాంగ్రెస్‌ బలాలు, బలహీనత

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి... ఇక్కడి నుంచే వరసగా పదకొండోసారి పోటీ చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ చివరి పది, పదిహేను రోజులే ప్రచారం చేసే జానారెడ్డి... ఈసారి ఎత్తుగడను మార్చారు. రెండున్నర నెలల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో... పరిచయాలుండటం జానాకు ప్రధాన బలం. పల్లెపల్లెలోనూ అనుచర గణం ఉండటంతోపాటు... పార్టీలోనూ ఆయనకు మంచి పేరు ఉంది. ఎవరితోనూ విభేదాలు లేకపోవడంతో... అందరూ ఆయన గెలుపు కోసం ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపారు. రాజకీయ చాణక్యం.. ఎంతటి వారినైనా తనవైపునకు తిప్పుకోగల నైపుణ్యం జానాకు కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెరాస, భాజపాలో ఉన్న జానా శిష్యులు... ఆయా పార్టీల్లో టికెట్లు దొరక్క అసంతృప్తులుగా ఉన్నందున... అలాంటి వారంతా ఈ ఉపఎన్నికల్లో జానా వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

జానారెడ్డి రాజకీయం

రాజకీయంగా ఇన్ని బలాలున్న జానారెడ్డి... తన శిష్యులను ఒక్కరొక్కని దూరం చేసుకోవడం ప్రధాన బలహీనతగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో.... ప్రత్యర్ధి పార్టీల బాధ్యతలు.... తన మాజీ శిష్యులే చూస్తున్నారు. ఏడుసార్లు శాసనసభ్యుడిగా... పలుమార్లు మంత్రిగా పనిచేసినా... సాగర్‌ అభివృద్ధిని..... అనుకున్నంత స్థాయిలో చేయలేదన్న అపవాదు జానాపై ఉంది. ముఖ్య అనుచరులతో కలిసి వెళ్తేనే జానా దర్శనభాగ్యం కలుగుతుందన్న భావన... అక్కడి శ్రేణుల్లో కనిపిస్తుంటుంది. దిగువ శ్రేణి కేడర్‌తో నేరుగా సంబంధాలు నెరపకపోవడం.... జానాకు ప్రధాన ప్రతికూలతగా చెబుతారు.

భాజపా బలాలు, బలహీనత

భాజపా నుంచి అనూహ్యంగా సివిల్ సర్జన్‌ రవికుమార్ టికెట్‌ దక్కించుకున్నారు. గిరిజన వర్గానికి చెందిన ఆయన... భారీగా ఉన్న తన సామాజికవర్గ ఓట్లే బలంగా రంగంలోకి దిగారు. ఒకవైపు అధికార పార్టీ తెరాస... మరోవైపు అత్యంత బలంగా కనిపించే... తన మాజీ గురువు జానారెడ్డి... ఇలా ఈ ఇరువురి మధ్య తానున్నానంటూ ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైద్యుడిగా ప్రజలకు సుపరిచితుడు కావడం... జానా శిష్యుడిగా పరిచయాలు ఉండటం... నిర్మల ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం రవికుమార్‌కు కలిసొచ్చే అంశాలు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన భరోసాతో... ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గిరిజనుల ఓట్లు 35 వేల వరకు ఉంటే.. తిరుమలగిరి మండలంలో సింహభాగం ఓటర్లున్నారు. ఈ ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్న రవి... కేంద్ర ప్రభుత్వ పథకాలూ సానుకూలంగా మారతాయనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు సెగ్మెంట్​లోని యువత, ఉద్యోగులంతా తమవైపే ఉంటారన్న భరోసా... రవికుమార్‌లో కనిపిస్తోంది.

రవికుమార్‌ పరిచయాలు

భాజపాలో పెద్దగా పరిచయాలు లేని రవికుమార్‌కు... ప్రతికూలతలు సైతం భారీగానే ఉన్నాయి. ఇతర సామాజికవర్గాలకు నేతలు, పార్టీలో సీనియర్లు... ఏ మేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకమే. గిరిజన ఓట్లపైనే పూర్తి భరోసా ఉండటం... మిగతా సామాజికవర్గాలపై దృష్టి పెట్టకపోవడం ఇబ్బందికర పరిణామంగా మారింది. రెండు ప్రధాన పార్టీలు విస్తృతంగా పర్యటిస్తున్నా... భాజపా ప్రచారం ఆ స్థాయిలో కనిపించలేదనే విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, డీకే అరుణ మాత్రమే... ప్రచారం నిర్వహించారు.

ఇదీ చూడండి : నాగార్జున సాగర్​లో జానారెడ్డి అనుభవం ఫలించేనా..!

Last Updated : Apr 15, 2021, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.