నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే ఆర్టీసీ బస్టాండు నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం ఆర్డీవోకి వినతి పత్రం అందజేశారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులతో ర్యాలీలో పాల్గొన్నారు. తాత్కాలిక కండక్టర్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని కార్మికులు తెలిపారు. స్పందించిన మిర్యాలగూడ డీఎం ఎక్కువ ఛార్జీలు వసూలు చేసిన తాత్కాలిక కండక్టరుపై కేసులు నమోదం చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: నిద్రిస్తున్నవారిపైకి దూసుకెళ్లిన బస్సు- ఏడుగురు మృతి