నార్కట్పల్లిలో ఆర్టీసీ కార్మికులు, విపక్షాల ఆందోళన - నల్గొండ జిల్లా నార్కట్పల్లి
నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో ఆర్టీసీ కార్మికుడు జమీల్ గుండెపోటుతో చనిపోవడానికి కారణం ప్రభుత్వమేనని కార్మికులు, విపక్షాలు ఆందోళన చేశాయి.
నార్కట్పల్లిలో ఆర్టీసీ కార్మికులు, విపక్షాల ఆందోళన
నల్గొండ జిల్లా నార్కట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుడు జమీల్.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గుండె పోటుతో మృతి చెందాడని కార్మికులు, విపక్షాలు ఆరోపించాయి. పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది వద్ద కూడా ధర్నా చేపట్టారు. జమీల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తీసుకురావటం వల్ల కార్మికులు, విపక్షాల నేతలు ర్యాలీగా వెళ్లి నివాళులు అర్పించారు.
sample description