ETV Bharat / state

ఇనుపాముల వద్ద రోడ్డు ప్రమాదం.. ఆరుగురికి తీవ్ర గాయాలు - నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

వలస కూలీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడం వల్ల ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను నకిరేకల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

నల్గొండ జిల్లాలో టాటా ఏస్​ను ఢీ కొట్టిన లారీ

author img

By

Published : May 31, 2020, 11:48 AM IST

నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట నుంచి ప్రకాశం జిల్లా అద్దంకికి వెళ్తున్న సమయంలో హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఇనుపాముల వద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు.

టాటా ఏస్​ను ఢీ కొట్టిన లారీ !

క్షతగాత్రుల్ని నకిరేకల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు టాటా ఏస్ వాహనాలు ఇనుపాముల వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో నెమ్మదించాయి. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ... ముందున్న ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. వాహనంలో మొత్తం 10 మంది ఉండగా ఆరుగురికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

ఇవీ చూడండి : పొంచి ఉన్న ముప్పు.. కరోనా వైరస్​ జీవాయుధమేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.