నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన లక్ష్మమ్మ భర్త 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఐదుగురు ఆడబిడ్డల బాధ్యతలను భుజాన వేసుకొని.. ఇడ్లీలు అమ్ముకుంటూ జీవనం సాగించింది. కూతుర్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపి ఒంటరిగా జీవిస్తోంది. ఆమె నివసిస్తున్న ఇల్లు ఇటీవల కూలిపోయింది.
అప్పటి నుంచి కూలిన ఇంట్లోనే ఉంటూ, వంట చేసుకుంటూ మధ్యాహ్నం వేళ అక్కడే ఉన్న గుడిలో నిద్రిస్తోంది. రాత్రి వేళల్లో పక్కన ఉన్న ఎవరో ఒకరింట్లో ఉంటోంది. ఈ విషయంపై ఈటీవీ భారత్లో అవ్వకు ఎంత కష్టమొచ్చే అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది.
ఈ కథనానికి స్పందించిన అదే ఊరికి చెందిన ఇమ్మడి భద్రయ్య 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందించారు. నీలా రవికుమార్ కూరగాయలు, పండ్లు, ఆర్థిక సహాయం చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం, నిత్యావసర సరకులు లక్ష్మమ్మకు ఇచ్చారు.
ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య