రాచకొండ గుట్టల్లో జలపాతాల అందాలు కనువిందు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో... దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల్లో నుంచి జలపాతాలు జాలువారుతున్నాయి. దీనివల్ల సంస్థాన్ నారాయణపురం మండల శివారు ప్రాంతాల్లో... ప్రకృతి రమణీయత తాండవిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాటర్ ఫాల్స్ పొంగిపొర్లుతోంది. జలపాతాల సోయగాల్ని వీక్షించేందుకు... పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ రజతోత్సవ వేళ.. తారల శుభాకాంక్షల వెల్లువ