రోజులు గడుస్తున్నాయి... చినుకు కోసం ఎదురు చూసిన కర్షకునికి కన్నీళ్లే మిగిలాయి. ఇకనైనా కనికరించాలి దేవుడా అంటూ... నల్గొండ జిల్లా చండూరు మండలం శిర్దేపల్లిలో గ్రామ దేవతలకు నీళ్లతో జలాభిషేకం చేశారు. డప్పు చప్పుళ్లతో, డోలు దరువులతో చెరువు కట్ట వద్ద ఉండే గంగాదేవి బండపై వరదపాశం పోసి వర్షాలు కురవాలని దేవుడిని వేడుకున్నారు.
ఇవీ చూడండి:'ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అవగాహన అవసరం'