మారుతీ రావు మృతి కేసులో ఆయన చరవాణిని విశ్లేషించడంతో పాటు... ఆర్యవైశ్య భవన్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గదిలో దొరికిన ఆధారాలను బట్టి అనుమానిస్తున్నామని అన్నారు. విషం డబ్బా మాత్రం గదిలో లభించలేదని... దానికోసం వెతుకుతున్నామని సైదిరెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత కథనాలు: శ్రవణ్ ఒత్తిడి వల్లే.. మారుతీరావు చనిపోయాడు!
ఆ చేతిరాత ఆయనదే
మిర్యాలగూడలోని ఫర్టిలైజర్ దుకాణానికి మారుతీరావు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు డ్రైవర్ ద్వారా తెలిసిందని వెల్లడించారు. అక్కడే పురుగుల మందు కొనుగోలు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత మారుతీ రావు మృతికి గల కారణాలు పూర్తిగా తెలుస్తాయని సైదిరెడ్డి తెలిపారు. మారుతీరావు గదిలో దొరికిన చీటిలో.. ఆయన చేతిరాతగానే కుటుంబ సభ్యులు నిర్ధరించినట్లు సీఐ పేర్కొన్నారు.
సంబంధిత కథనాలు: అమృత వల్లే ఈ దారుణాలన్నీ: మారుతీరావు తమ్ముడు శ్రవణ్
ఫోన్లో మాట్లాడాను
ప్రణయ్ హత్య కేసులో విచారణ కొనసాగుతుండటంతో.... మారుతీరావు కొంత ఆందోళనగా ఉన్నాడని ఆయన తరఫు న్యాయవాది సుబ్బారెడ్డి తెలిపారు. కేసులో దోషిగా తేలితే శిక్ష పడుతుందనే భయం ఉండేదని పేర్కొన్నారు. కుమార్తె అమృత దూరమవడంతో పాటు... కేసులో రాజీపడకుండా ముందుకు వెళ్తుండటంతో మారుతీరావు మనస్తాపానికి గురైనట్లు సుబ్బారెడ్డి చెప్పారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు శనివారం తనను కలిసేందుకు వచ్చాడని... అదే రోజు రాత్రి ఫోన్లో కేసుకు సంబంధించిన వివరాలు మాట్లాడాడని న్యాయవాది సుబ్బారెడ్డి తెలిపారు.
సంబంధిత కథనాలు: 'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'