ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు.. రైతులకు ప్రజాప్రతినిధుల సూచనలు

IKP Centres in Telangana: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. కేంద్రాలు ఏర్పాటు చేసి ఆఖరి గింజ వరకు కొనాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఐకేపీ కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. మద్దతు ధర ఇచ్చి చివరి గింజ వరకు కొంటామన్న సీఎం హామీ నేపథ్యంలో... రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచిస్తున్నారు.

IKP Centres in Telangana
తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
author img

By

Published : Apr 15, 2022, 7:43 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు

IKP Centres in Telangana: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు మొదలుపెడుతున్నారు. నల్గొండ సమీపంలోని అర్జాలబావి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. రైతులు వడ్లను ఆరబెట్టి 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ స్వయంగా రైతు కావడం వల్లే అన్నదాతల కష్టాలను చూసి... ధాన్యం కొనేందుకు ముందుకు వచ్చారని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కేంద్రం మొండిచేయి చూపినా రాష్ట్రప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు.

"ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని.. వీలైనంత మేర సాయం చేసేందుకు ప్రయత్నించాలి. మీ చేతకానితనాన్ని.. మేమే మెడలు వంచి వడ్లు కొనేలా చేస్తున్నామని చెప్పడం ప్రతిపక్షాలకు సరికాదు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని.. రైతుల కోసం సీఎం కేసీఆర్​ చేస్తున్నారు." -గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌

అప్పు లేని రైతును చుడాలనేదే సీఎం కేసీఆర్​ సంకల్పమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మార్కెట్ కమిటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోచారం ప్రారంభించారు. పాదయాత్రల పేరుతో తిరుగుతున్న నాయకుడు ఒక్కరోజైనా తెలంగాణ రైతుల వడ్లు కొనాలని పార్లమెంట్‌లో మాట్లాడారా అని ప్రశ్నించారు.

"రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు అన్నీ అమలు చేస్తున్నాం. కానీ విమర్శలు చేస్తున్న నాయకులు.. వారు పాలిస్తున్న ప్రాంతాల్లో ఇవన్నీ అమలు చేస్తున్నారా.? ఒక్కసారైనా రైతుల గురించి పార్లమెంటులో మాట్లాడారా.?" -పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభ సభాపతి

రైతుల ఆందోళన: నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం గూడూరు వద్ద రైస్ మిల్లు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మిల్లర్లు సిండికేట్‌గా మారి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకం చింట్లను మొదట 2,400లకు కొన్నారని, ఇప్పుడు 1800 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ ఐకేపీ కేంద్రాలను త్వరగా ప్రారంభించి... వడ్లను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరారు.

చెక్​పోస్ట్​ వద్ద తనిఖీలు: రాష్ట్రంలో మద్దతు ధర ఇచ్చి వడ్లు కొంటుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెలంగాణకు ధాన్యం తీసుకురాకుండా ప్రభుత్వం అప్రమత్త చర్యలు చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. తనిఖీల్లో భాగంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్న ధాన్యపు 15 లారీలను పోలీసులు నిలిపివేశారు.

ఇవీ చదవండి: ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు: లక్ష్మణ్​

పెళ్లిని అడ్డుకునేందుకు యత్నించిన యువతి.. జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు

గుజరాత్​లోనూ 'బుల్​డోజర్ ట్రెండ్'​.. నిందితుడి ఆస్తులు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.