ఉమ్మడి నల్గొండ జిల్లా వరి రైతులను టోకెన్(Farmers protests for Tokens) కష్టాలు వెంటాడుతున్నాయి. వరి కోయాలంటే టోకెన్ ఉండాలనే నిబంధన విధించడంతో అన్నదాతలు తెల్లవారుజాము నుంచే వ్యవసాయ కార్యాలయాలకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. కానీ అధికారులు సకాలంలో కార్యాలయాలకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇందుకు నిరసనగా రైతులు త్రిపురారంలో రాస్తారోకోకు దిగారు. టోకెన్ల జారీ(Farmers protests for Tokens)లో నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. టోకెన్లు ఉంటేనే రోడ్డుపైకి ట్రాక్టర్లు రావాలని పోలీసులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చివరకు పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు నిరసన విరమించారు.
మిర్యాలగూడలో టోకెన్ల కోసం బారులు
మిర్యాలగూడలోని రైతు వేదిక వద్ద ధాన్యపు టోకెన్ల(Farmers protests for Tokens) కోసం రైతన్నలు బారులు తీరారు. ఉదయం నాలుగు గంటల నుంచే టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నా.. అదేమీ పట్టనట్లుగా అధికారులు 11 గంటలకు నెమ్మదిగా టోకన్లు పంపిణీ చేపట్టారు. మూడో తేదీనే.. టోకెన్ల కోసం వచ్చామని అప్పుడు టోకెన్లు లేవని ఈ రోజు రమ్మని చెప్పారని అక్కడున్న రైతులు పేర్కొన్నారు. చీటీ రాసి ఇవ్వడంతో ఉదయం నుంచి వేచి చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. టోకెన్ల కోసం ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బందిగా ఉందని.. ఆవేదన వ్యక్తం చేశారు.
తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నాం. నిన్న పండుగ సందర్భంగా సెలవు ఉన్నా.. ఈ రోజైనా ఇంతవరకూ ఒక్క అధికారి రాలేదు. ఓ వైపు చేలో పంట కోతకు సిద్ధంగా ఉంది. వర్షం వస్తే ఇన్నాళ్లు పడిన కష్టమంతా వృథా అవుతుంది. రైతులను పట్టించుకునే వారే లేరు. టోకెన్లు కూడా సరిపడా ఇవ్వడం లేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోతున్నాం. - రైతులు
తిండీతిప్పలు మాని
మగవారు పొలంలో పడిపోయిన పంటను కట్టలు కడుతుండగా.. తాము క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్నామని మహిళా రైతులు వాపోతున్నారు. తిండీతిప్పలు లేకుండా టోకెన్ల కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వెలిబుచ్చారు. టోకెన్లు(Farmers protests for Tokens) ఆలస్యంగా ఇస్తే పంటపొలాల పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం అమ్మకానికి మిల్లుకు వెళ్తే గిట్టుబాటు ధర కూడా రావడం లేదని వాపోయారు. అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలిసిన వారికే ఇస్తున్నారు..
సూర్యాపేట జిల్లాలోనూ టోకెన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గరిడేపల్లి, నేరేడు చర్ల మండలాల్లో కోదాడ- మిర్యాలగూడ జాతీయ రహదారిపై రైతులు(Farmers protests for Tokens) ధర్నా నిర్వహించారు. ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్ల కోసం ఇబ్బందులు పడాల్సిన ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ప్రతి మండలంలో టోకెన్ల విధానం ఏర్పాటు చేసి ప్రతి రోజూ టోకెన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి(Farmers protests for Tokens) విజ్ఞప్తి చేశారు.
రోజుకు 30 టోకెన్లు(Farmers protests for Tokens) ఇస్తే సరిపోవని.. 150 టోకెన్లు ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. టోకెన్ల పంపిణీ విషయంలో పక్షపాతం వహిస్తూ.. తెలిసిన వారికే ఇస్తున్నారని మండిపడ్డారు. దిగుమతి ఆలస్యమయితే ధాన్యం నల్లరంగులోకి మారి గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోజు సేకరించిన ధాన్యాన్ని ఆ రోజే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Online Mutation: రిజిస్ట్రేషన్ అయ్యిన 5 నిమిషాల్లోనే.. చేతికి మ్యుటేషన్