ETV Bharat / state

అందరూ సీనియర్లే.. నల్గొండలో గెలుపెవరిదో...? - నల్గొండ పోలింగ్​

ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయిస్తే అధికారులు వాటిని సరిచేశారు. ఈసారి పట్టణ ప్రాంత ఓటర్లు ఓటింగ్​లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. గతంతో పోలిస్తే  ఓటింగ్​ శాతం తగ్గింది. నల్గొండలో 66 శాతం నమోదైతే.. భువనగిరిలో 68 శాతంగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రక్రియ పూర్తి  చేశారు అధికారులు.

నల్గొండలో పోలింగ్ ప్రశాంతం
author img

By

Published : Apr 12, 2019, 12:46 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొన్నారు. ఎండతీవ్రత కారణంగా ఉమ్మడి నల్గొండలోని సూర్యాపేట, భువనగిరిలలో మధ్యాహ్నానికి పోలింగ్​ మందగించింది. పట్టణ ఓటర్లు ఈసారి ఆసక్తి చూపలేదు. గతంతో పోలిస్తే ఓటింగ్ ​శాతం తగ్గినట్లుగా అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల పోలింగ్​ సమయం ముగిసినప్పటికీ క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

ఓటేసిన ప్రముఖులు..

సూర్యాపేట జిల్లాలోని కోదాడలో పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ అభ్యర్థి ఉత్తమ్​కుమార్ రెడ్డి​ సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనగిరిలోని పాత గుండ్లపల్లిలో సీపీఐ ఎంపీ అభ్యర్థి గోదా శ్రీరాములు ఓటింగ్​లో పాల్గొన్నారు. సూర్యాపేటలోని రాయిని గూడెం 27వ పోలింగ్ కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, నల్గొండ సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్​లో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సతీ సమేతంగా ఓటు వేశారు. 90వ పోలింగ్​ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డి తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
భువనగిరి జిల్లా ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్​ అనితా రామచంద్రన్​ ఓటు వేశారు. సూర్యాపేట 64వ పోలింగ్​ కేంద్రంలో కలెక్టర్​ అమోయ్​ కుమార్​ సతీసమేతంగా క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84వ పోలింగ్​ కేంద్రంలో మాజీ మంత్రి ఆర్​ దామోదర్​రెడ్డి ఓటు వేశారు.

కేంద్రాల్లో పర్యటించిన నేతలు

జిల్లాలోని పలు కేంద్రాల్లో పార్టీ నేతలు పర్యటించి ఓటింగ్​ సరళిని పరిశీలించారు. సూర్యాపేటలో తెరాస ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​ పర్యటించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరిశీలించారు. తిరుమలగిరిలో భువనగిరి కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. పోలింగ్​ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈవీఎంల మొరాయింపు

జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఓటింగ్​ యంత్రాల్లో సాంకేతిక లోపంతో చాలాసేపు పోలింగ్​ నిలిచి పోయింది. అధికారులు కొత్త వాటిని అమర్చి పోలింగ్​ జరిపారు. ముఖ్యంగా సూర్యాపేటలో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. భువనగిరిలో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి నమోదవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇక్కడ ఈవీఎంలను నిపుణులు సవరించిన తరువాత ప్రక్రియ యథావిధిగా కొనసాగింది.

పలు చోట్ల ఓటింగ్​ బహిష్కరణ

ఉమ్మడి నల్గొండలో కొన్ని చోట్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఓటింగ్​ బహిష్కరించారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని పావురాల గుట్ట గ్రామస్థులు తీర్మానిస్తూ ఓటింగ్​లో పాల్గొనలేదు. భువనగిరి పరిధిలోని మీట్​ నాయక్​ తండా ప్రజలు ఓటు వేయలేదు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారులు వచ్చి మాట్లాడినా ఫలితం లేకపోయింది.
ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా పార్టీల సీనియర్​ నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి గెలుపెవరిదో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే..!

నల్గొండలో ప్రశాంతంగా సాగిన పోలింగ్​

ఇదీ చదవండి : ఓటు హక్కు వినియోగించుకున్న పోలీస్​ అధికారులు

Intro:TG_KRN_104_11_POLICELU_VOTERLA ADDAGINTHA_AV_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ నియోజకవర్గం లో అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుస్నాబాద్ ఏసిపి మహేందర్ ఆర్డిఓ అనంత రెడ్డి గారు ఎస్సై సుధాకర్ దంపతులు హుస్నాబాద్ పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు నిరీక్షణ చేయక తప్పలేదు. ఎన్నికల సమయం ఐదు గంటలు దాటిన తర్వాత కూడా కొంత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడంతో పోలీస్ సిబ్బంది వారికి సమయం అయిపోయిందని తెలిపి తిరిగి పంపించి వేయడం జరిగింది.

Body:హుస్నాబాద్ నియోజకవర్గం లో

Conclusion:ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.