ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అధికారులు సామగ్రి అందజేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించి నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంపిణీ చేశారు.
సూర్యాపేట జిల్లావి అక్కడి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో... యాదాద్రి జిల్లాకు సంబంధించి భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో అందించారు. బ్యాలెట్ పత్రాలు, పెట్టెలతోపాటు ఇతర వస్తువుల్ని... ప్రిసైడింగ్ అధికారులతో కూడిన బృందాలకు అందజేశారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఓటర్లకు డబ్బులిస్తాం.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్