నల్గొండ జిల్లా అవంతిపురం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేసి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని మంత్రి తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జలకళ తీసుకొచ్చామన్నారు. రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేసి రైతన్నలను అండగా నిలిచామని పేర్కొన్నారు. ఎన్నేళ్లు పదవిలో ఉన్నామనే దానికంటే ఎంత సేవచేశామన్నదే ముఖ్యమని ఎమ్మెల్సీ గుత్తా తెలిపారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మిర్యాలగూడ పట్టణం నుంచి అవంతిపురం మార్కెట్ వరకు తెరాస కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ చేశారు.
ఇవీ చూడండి: ఆ ఊరిని పిశాచిలా పట్టుకున్న విషజ్వరాలు