ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా.. 250 దాటిన కేసులు - ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా

ఉమ్మడి నల్గొండ జిల్లాలో శుక్రవారం... 20 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఏడేసి చొప్పున... యాదాద్రి జిల్లాలో ఆరు ఉన్నాయి. మూడు జిల్లాల్లో వలస జాబితాలో చేరిన వారితో కలిపి... కేసుల సంఖ్య 250 దాటింది.

number of corona cases exceeding 20 in combined Nalgonda District
ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా.. 250 దాటిన కేసులు
author img

By

Published : Jul 4, 2020, 9:00 AM IST

పాజిటివ్ కేసులతో హైదరాబాద్ జంట నగరాలు బెంబేలెత్తిపోతుంటే... శివారు జిల్లాల్లోనూ వాటి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత వారం వ్యవధిలోనే... కేసులు రెట్టింపయ్యాయి. గత నెల 26 నాటికి 29 కేసులతో ఉన్న నిన్నటికి 79కి చేరుకుంది. ఈ ఎనిమిది రోజుల్లోనే 50 కేసులు పెరిగాయి. అదే సమయంలో సూర్యాపేట జిల్లాలో 14, యాదాద్రి జిల్లాలో 12 పాజిటివ్​ కేసులు నిర్ధరణయ్యాయి. ఇలా మూడు జిల్లాల పరిధిలో వారం వ్యవధిలోనే... 76 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కేసుల వివరాలు ఇలా...

శుక్రవారం నల్గొండలో ఏడు, సూర్యాపేటలో ఏడు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయి. యాదాద్రిలో నమోదైన కేసుల్లో ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత... ఆమె వ్యక్తిగత సహాయకుడితోపాటు అంగరక్షకుడు సైతం వ్యాధి బారిన పడ్డారు. ఇక ఆలేరు బ్యాంకులో పనిచేసే మహిళా ఉద్యోగి, వలిగొండకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి, భువనగిరి ఏఆర్​హెడ్ క్వార్టర్స్​లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్​కు... వైరస్ సోకింది.

రావాల్సిన 337 ఫలితాలు

నల్గొండ జిల్లాలో ఏడుగురికి గానూ... జిల్లా కేంద్రంలో నలుగురు, మిర్యాలగూడలో ఇద్దరు, నిడమనూరులో ఒకరు బాధితులుగా మిగిలారు. ప్రాథమిక కాంటాక్టులను గుర్తిస్తున్న వైద్య సిబ్బంది... 121 మంది నమూనాల్ని పరీక్షలకు పంపించారు. నిన్నటివరకు ఉన్న 216 మందితో కలిపి మొత్తంగా... ఇంకా 337 మంది ఫలితాలు రావాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడలో నలుగురు, సూర్యాపేట, నడిగూడెం, నేరేడుచర్లలో ఒక్కొక్కరు చొప్పున వ్యాధికి గురయ్యారు.

ఆందోళనకర పరిస్థితి

సూర్యాపేట జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య వంద దాటగా... నల్గొండ ఆ దిశగా దూసుకెళ్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వల్ల... వ్యాపార కార్యకలాపాల్ని తగ్గించుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే... దుకాణాలు తెరచి ఉంచుతున్నారు. ప్రాథమిక కాంటాక్టుల పేరిట పెద్దయెత్తున నమూనాలు సేకరిస్తుండటం వల్ల... ఆయా ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది.

ఇవీ చూడండి: 'మహా'లో కరోనా రికార్డు.. ఒక్కరోజే 6వేలమందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.