ETV Bharat / state

సాగర్‌ ఉపఎన్నిక బరిలో 41మంది అభ్యర్థులు - Nagarjunasagar by-election latest update

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. తుది పోరుకు మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Nagarjunasagar by-election
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
author img

By

Published : Apr 3, 2021, 5:17 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికకు 41 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉపఎన్నికలో మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. నామపత్రాల పరిశీలనలోనే 17 మంది పత్రాలను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 60 మందిలో 19 మంది అభ్యర్థులు తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా సాగర్ ఉప ఎన్నిక బరిలో 41 మంది నిలిచారు.

తెరాస నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, భాజపా నుంచి రవినాయక్ బరిలో ఉన్నారు. మరోవైపు పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఇంటింటికీ వెళ్లి ఆశీర్వదించాలని ఓటరు మహాశయులను కోరుతున్నారు.

ఇదీ చూడండి: నాగార్జునసాగర్​ ప్రచారం: అభ్యర్థనలు.. భావోద్వేగాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.