నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసినప్పటి నుంచి వాంతులు, విరేచనాలు, తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డారు. విషయం గమనించిన పాఠశాల సిబ్బంది వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 35 మంది విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి: అలా అయితే పాకిస్థాన్ వెళ్లిపోండి: పోలీస్ ఉన్నతాధికారి