ETV Bharat / state

నెల్లికల్లు ఎత్తిపోతలలో 16 మెగావాట్ల సామర్థ్యంతో పంపుల ఏర్పాటు - తెలంగాణ తాజా వార్తలు

నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌ మండలంలో చేపట్టనున్న నెల్లికల్లు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు వ్యయం దాదాపు రూ.640 కోట్లుగా అంచనా వేస్తున్నారు. నెల్లికల్లు వద్ద సాగర్‌ నుంచి 151 మీటర్ల వద్ద నీటిని తోడి 236 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే సామర్థ్యంతో పనులు చేపట్టనున్నారు.

నెల్లికల్లు ఎత్తిపోతలలో 16 మెగావాట్ల సామర్థ్యంతో పంపుల ఏర్పాటు

author img

By

Published : Mar 2, 2021, 6:55 AM IST

నల్గొండ జిల్లాలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు వ్యయం దాదాపు రూ.640 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక్కడున్న చిన్నతరహా ఎత్తిపోతల సామర్థ్యం పెంచి నాలుగువేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేలా ప్రభుత్వం గత నెలలో రూ.74 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన కూడా చేశారు. నెల్లికల్లు కింద 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉందని విశ్రాంత ఇంజినీర్ల సంఘం పలుమార్లు చేసిన విజ్ఞప్తులకు స్పందించి ప్రభుత్వం సామర్థ్యం పెంచేందుకు నిర్ణయించింది. సంబంధిత డిజైన్లు, లైన్‌ డయాగ్రం సిద్ధమవ్వగా ప్రతిపాదనల దస్త్రాన్ని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రెండున్నర టీఎంసీలు ఎత్తిపోసేలా...

నెల్లికల్లు వద్ద సాగర్‌ నుంచి 151 మీటర్ల వద్ద నీటిని తోడి 236 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే సామర్థ్యంతో పనులు చేపట్టనున్నారు. నాలుగు మెగావాట్ల సామర్థ్యమున్న నాలుగు పంపులను ఏర్పాటు చేయనున్నారు. 120 రోజుల్లో రెండున్నర టీఎంసీలను ఎత్తిపోయాలనేది లక్ష్యం. ప్రధానంగా సాగర్‌ జలాశయం కింద మొదటి మేజర్‌ రాజవరం పరిధిలో నాలుగున్నర వేల ఎకరాల ఆయకట్టుతో పాటు తిర్మలగిరి మండలంలో మొత్తం 24వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. పంప్‌హౌస్‌ విస్తరణ, మోటార్లు, ప్రెషర్‌ మెయిన్‌ డయా పెంచడం, విద్యుత్తు పనులు కొత్తగా చేపట్టాల్సి ఉంది.

ఇదీ చూడండి: ఈ నెల 4న యాదాద్రిని సందర్శించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.