ETV Bharat / state

'మర్డర్' సినిమాపై విచారణ వాయిదా​ - రాంగోపాల్​పై అమృత కేసు

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా మర్డర్​ సినిమా తీస్తున్నారని ఆరోపిస్తూ... దర్శకుడు రాంగోపాల్ వర్మపై దాఖలైన పిటిషన్​పై జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. తమ మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రణయ్​ భార్య అమృత జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో వేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

court hearing pil on murder movie
'మర్డర్' సినిమాపై అమృత దాఖలుచేసిన పిటిషన్​పై విచారణ వాయిదా​
author img

By

Published : Aug 11, 2020, 6:49 PM IST

తమ మనోభావాలు కించపరిచేలా మర్డర్​ సినిమా తీస్తున్నారంటూ దర్శకుడు రాంగోపాల్​వర్మపై... ప్రణయ్​ భార్య అమృత దాఖలు చేసిన పిటిషన్​పై నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ చేపట్టింది. మర్డర్ సినిమాను ఆపాలని గత నెలలో అమృత పిటిషన్​ వేసింది. పిటిషన్​పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువురి వాదనలు విని తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.

దర్శకుడు రాంగోపాల్​ వర్మ కరోనా పాజిటివ్​ రావడం వల్ల కోర్టుకు రాలేరని... అందువల్ల గడువు ఇవ్వాలని రాంగోపాల్​ వర్మ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కానీ రాంగోపాల్​ వర్మకు కరోనా సోకలేదని.. తప్పించుకోవడానికే అసత్యం చెబుతున్నారని పిటిషనర్​ తరఫు న్యాయవాది ఆరోపించారు.

ఇవీ చూడండి: కుంగుతున్న కాలువలు... వృథాగా పోతున్న నీరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.