ETV Bharat / state

ఎంజీయూ సెమిస్టర్‌ ఫలితాల్లో పొరపాట్లు

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల విభాగం లోపాలు రోజురోజుకి ఒక్కొక్కటి బయటికొస్తున్నాయి. అధికారులు మారినా పరీక్షల నిర్వహణలో..మార్కుల విడుదలలో తప్పుల తడకలు ఆగడం లేదు. తాజాగా ఎంజీయూ విడుదల చేసిన డిగ్రీ ఆరో సెమిస్టర్‌ ఫలితాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఎంజీయూ సెమిస్టర్‌ ఫలితాల్లో పొరపాట్లు
author img

By

Published : Jul 27, 2019, 9:40 AM IST

పరీక్షలు బాగా రాసినా ఊహించని విధంగా కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యామని వాపోతున్నారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు. నల్గొండలో ఓ కళాశాలకు చెందిన బీఏ టీహెచ్‌పీ ఆరో సెమిస్టర్‌కు చెందిన విజయలక్ష్మి అనే విద్యార్థిని... 7 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో మాత్రం ఫెయిల్‌ అయింది. ఈమె మెరిట్‌ విద్యార్థిని. ఐదో సెమిస్టర్‌ ఫలితాల్లో అన్ని సబ్జెక్టులో పాసై 10కి 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించి ప్రతిభ చాటింది. తాను రాసిన ఆ సబ్జెక్టులో 70 మార్కుల వరకు వస్తాయని భావిస్తుంటే ఫెయిల్‌ అయ్యానని తెలిసి అవక్కయ్యానని వాపోయింది.

పలువురు బాధితులు
ఇదే కళాశాలలో బీఏ ఈహెచ్‌పీ ఆరో సెమిస్టర్‌ విద్యార్థి శ్రవణ్‌కుమార్‌ 7 సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి బయోఫర్టిలైజర్‌ సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యాడు. ఇతనూ మెరిట్‌ విద్యార్థే. ఏడో సెమిస్టర్‌ ఫలితాల్లో అన్ని సబ్జెక్టులు పాసై 9.50 గ్రేడ్‌ పాయింట్లతో సత్తా చాటారు. తాను పరీక్ష బాగా రాశానని...అసలు ఆ సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యే ప్రసక్తే లేదని పేర్కొంటున్నాడు. ఇదే కళాశాలకు చెందిన బీఏ హెచ్‌పీపీ విద్యార్థి నవీన్‌ 7 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యాడు. పరీక్ష బాగా రాసినా తాను ఒక సబ్జెక్టులో ఊహించని విధంగా ఫెయిల్‌ కావడంతో కలతచెందానని వాపోయాడు. ఇతనూ మెరిట్‌ విద్యార్థే. ఐదో సెమిస్టర్‌ ఫలితాల్లో అన్ని సబ్జెక్టులు పాసై 9.14 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు.

తమకు న్యాయం జరుగుతుందా
పరీక్షలు బాగా రాసినా ఒక్కొక్క సబ్జెక్టులో ఫెయిల్‌ కావడం విచిత్రంగా ఉందని ఎంజీయూ పరీక్షల విభాగంలో జరిగిన పొరపాట్ల కారణంగానే తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు వాపోతున్నారు. డిగ్రీ ఫలితాల్లో ఒక్కో సబ్జెక్టు బ్యాక్‌లాగ్‌ కారణంగా ఈ ఏడాది తాము పీజీ, బీఈడీ చేయలేమోనని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పిన సబ్జెక్టుల్లో తిరిగి వెంటనే ఉత్తీర్ణత సాధించడానికి ఇప్పట్లో సప్లిమెంటరీ పరీక్షలు సైతం లేవు. రీవాల్యుయేషన్‌లో మార్కులు పెరిగితే తప్ప తాము పీజీ, బీఈడీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. కౌన్సెలింగ్‌ లోపే అధికారులు రీవాల్యుయేషన్‌ ఫలితాలు ఇస్తారా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థులు మాత్రం రీవాల్యుయేషన్‌లోనైనా తమకు న్యాయం జరుగుతుందా.. లేదా సంవత్సరం వృధా అవుతుందా అని కంగారుపడుతున్నారు. ఇలా అన్యాయం జరిగిన విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో పలువురు ఉన్నట్లు సమాచారం. పరీక్షల విభాగంలో పొరపాట్ల వల్లే ఇలాంటి సంఘటనలు బహిర్గతమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

అధికారులకు మొర
పరీక్ష ఫలితాల్లో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న ఈ ముగ్గురు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని అధికారులను కలిశారు. తమకు త్వరితగతిన న్యాయం చేయాలని మొర పెట్టుకున్నారు. ప్రస్తుతం చేసేది ఏమీ లేదని రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఇదీ చూడండి : స్నేహితులతో కలిసి పెద్దమ్మ ఇంటికి కన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.