నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురం వద్ద చిరుత వలలో పడింది. అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుతపులి చిక్కింది. గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది...మత్తు మందు ఇచ్చి చిరుతపులిని బంధించారు. చిరుత పులిని అధికారులు హైదరాబాద్లోని నెహ్రూ జూపార్కుకు తరలించారు.
ఇవీ చూడండి: ఒకే ఆస్పత్రిలో గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారుల మృతి