ETV Bharat / state

సాగర్‌-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం ప్రారంభం

author img

By

Published : Nov 21, 2020, 6:52 AM IST

Updated : Nov 21, 2020, 12:49 PM IST

నాగర్జునసాగర్​ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రారంభమైంది. ఈ మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 9: 30కు బయలు దేరిన లాంచీ.. పర్యటన పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం 3:30 కు తిరిగి వస్తుంది.

nagarjunasagar and srisailam lanchi journey start from today

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రారంభమైంది. లాంచీ ప్రయాణాన్ని నందికొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూషారెడ్డి, అటవీశాఖ అధికారి సర్వేశ్వర్​రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సాగర్ లాంచీ స్టేషన్ నుంచి 16 మంది పర్యాటకులతో శ్రీశైలానికి బయలుదేరిన లాంచీ... సాగర్ నుండి 6 గంటల పాటు సాగే ప్రయాణం సాగుతుంది. కొండల నడమ ఆహ్లదకరం సాగే ప్రయాణం సాయంత్రానికి శ్రీశైలానికి చేరుకుంటుంది.

సాగర్‌-శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం
సాగర్‌-శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం

అక్కడి నుంచి పర్యాటక శాఖకు చెందిన బస్సుల ద్వారా పర్యాటకులకు శ్రీశైలంలోని దర్శనీయ స్థలాలను చూపి, దైవదర్శనం చేయించి రాత్రి బస కల్పిస్తారు. తిరిగి ఆదివారం ఉదయం 9:30 గంటలకు లాంచీ... శ్రీశైలం నుంచి బయలుదేరి సాయంత్రం 3:30 గంటలకు సాగర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పర్యాటకులను బస్సు ద్వారా హైదరాబాద్‌కు తీసుకెళ్తారు.

వారంలో ప్రతి శనివారం... సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ వెళుతుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. సాగర్ నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకునే వారు పర్యాటక శాఖ వెబ్​సైట్ ద్వారా ఆన్​లైన్​లో టికెట్స్ పొందవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి: యాదాద్రి బాలాలయంలో ఆండాళ్ అమ్మవారికి ఘనంగా ఊంజల్ సేవ

Last Updated : Nov 21, 2020, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.