అన్ని అనుమతులు మంజూరు కావడం వల్ల నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ఇవాళ ప్రారంభమైంది. సాగర్ అటవీశాఖ అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో జెండా ఊపి ట్రిప్పును ప్రారంభించారు.
వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది పర్యాటకులు, ఇద్దరు గజ ఈతగాళ్లు, 8 మంది సిబ్బందితో కలిపి మొత్తం 60 మంది పడవలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కచులూరు లాంచి ప్రమాదం తర్వాత భద్రతా చర్యల దృష్ట్యా నిలిపివేసాక అధికారుల ఆదేశాలతో ఉదయం మొదటి ట్రిప్పును వేశారు.
పర్యాటకులు లైఫ్ జాకెట్ను తప్పనిసరిగా ధరించేలా పర్యాటక శాఖ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ప్రతి శనివారం సాగర్ నుంచి లాంచీని నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు