ETV Bharat / state

'కొవిడ్ లక్షణాలుంటే.. వెంటనే పరీక్ష చేయించుకోవాలి'

కరోనా లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ సూచించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని పెద్ద దేవులపల్లి పీహెచ్​సీని తనిఖీ చేశారు.

mla  nomula bhagath, nagarjuna sagar mla nomula bhagath
ఎమ్మెల్యే నోముల భగత్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్
author img

By

Published : May 25, 2021, 2:07 PM IST

కొవిడ్ లక్షణాలున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ సూచించారు. ఐసోలేషన్​కు ఇబ్బంది ఉన్న వారు పాఠశాలలో ఉండొచ్చని తెలిపారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే భగత్.. సిబ్బంది లేక పోస్టులు ఖాళీగా ఉండటం తెలిసి.. ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. వీలైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వైరస్ బారిన పడి ఇంట్లో ఐసోలేషన్ సౌకర్యం లేని వారు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.