నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతోంది. జలాశయం 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 4లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతున్నది.
ఇవీ చూడండి: నల్లమల యురేనియం తవ్వకాలపై నాన్నతో మాట్లాడతా...!