నాగార్జున సాగర్లో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తాను చేసిన అభివృద్ధి తప్ప తెరాస చేసిందేమి లేదని ఆ పార్టీ సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి జానారెడ్డి అన్నారు. నియోజకవర్గం పరిధిలోని అనుముల మండలం శ్రీనాధపురం, చింతగూడెం, రామడుగు గ్రామాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సాగర్ ఉప ఎన్నికలో తెరాసకు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ను గెలిపించాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఈత నేర్పిస్తామని చెరువులో నెట్టేసిన స్నేహితులు.. యువకుడు మృతి!