నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గపరిధిలో ఉన్న సమస్యలపై సాగర్ భాజపా ఇన్ఛార్జి కంకణాల నివేదిత.. గుర్రంపోడు మండలం జూనూతల గ్రామం నుంచి పోరుబాట ప్రారంభించారు. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తానని నివేదిత అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలపై పోరుబాట ద్వారా పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు.
గతంలో కాంగ్రెస్, ఇప్పడు తెరాస.. సాగర్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశాయని నివేదిత ఆరోపించారు. సమస్యలు తీరడం లేదు సరికదా కొత్త సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను గాలికి వదిలేశాయని మండిపడ్డారు. అధికారం కాపాడుకోవడం కోసమే తెరాస ఆరాటమంతా అని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో మంచినీటి, పారిశుద్ధ్య, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరుబాటలో నల్గొండ జిల్లా భాజపా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'తెరాస నాయకుడు నా పొలాన్ని ఆక్రమించుకున్నారు'