నాగార్జునసాగర్ జలాశయ 24 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి వరద క్రమంగా పెరగడం వల్ల 24 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ప్రస్తుతం 2 లక్షల 18వేల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగుల మేర నీరు చేరుకుంది. 312 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకు 312.40 టీఎంసీల నీరు నిల్వ ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
- ఇదీ చూడండి : సాగార్జున సాగర్ అందాలు చూడతరమా..