ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ 16 క్రస్ట్ గేట్లను 10 అడగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 2లక్షల 70 వేల క్యూసెక్కుల వరద ఎగువ నుంచి నీరు చేరుతుండగా... అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడగులు కాగా ప్రస్తుతం 589.40 అడగులకు చేరింది. సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలకు చేరింది.
ఇదీ చదవండి: కరోనా ఇంకా ఉంది.. అలసత్వం వద్దు: మోదీ