మారుతీ రావు మృతి కేసులో సైఫాబాద్ పోలీసులు.. ఇవాళ డ్రైవర్ రాజేశ్‌ను ప్రశ్నించారు. మిర్యాలగూడ నుంచి సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అతని నుంచి పలు వివరాలు సేకరించారు. మిర్యాలగూడ నుంచి బయల్దేరే ముందు మారుతీరావు... ఓ పురుగుల మందు దుకాణం వద్ద కాసేపు ఆగినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఖాళీ సమాయాల్లోనూ మారుతీ రావు తరచూ అక్కడ కూర్చుండేవాడని వివరించాడు.
శనివారం సాయంత్రం ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్న తర్వాత... రాత్రి బయటికి వెళ్లి అల్పాహారం తీసుకున్నట్లు తెలిపాడు. గదిలోకి వెళ్లాక... గారెలు తెప్పించుకొని తిన్నట్లు డ్రైవర్ తెలిపాడు. తాను గదిలో పడుకుంటానని కోరినా... వాహనంలోనే పడుకోవాలని సూచించడంతో కిందికి వెళ్లినట్లు పోలీసులకు వివరించాడు.
ఉదయం మారుతీరావు భార్య... ఫోన్ కలవడంలేదని చెప్పడంతో... పైకి వెళ్లి చూసినా... గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చినట్లు డ్రైవర్.. పోలీసులకు వివరించారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బంది తలుపులు గట్టిగా నెట్టి... లోపలికి వెళ్లి చూడగా మారుతీరావు పరువుపై పడిపోయినట్లు గుర్తించామని తెలిపాడు. పోలీసులు డ్రైవర్ రాజేశ్ చరవాణిని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే భవవంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఇదీ చూడండి: నాన్న ఆస్తి నాకొద్దు.. అమ్మే నా దగ్గరికి రావాలి: అమృత