ఎస్సీలను ఓట్లు అడిగే హక్కు ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీల చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్ని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మోసం చేశాయని మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే ఎస్సీలు గుర్తుకువస్తారని దుయ్యబట్టారు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ కోసం ఇచ్చిన మాట తప్పాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలతో ప్రజలకు చేరువైన మహా జన సోషలిస్టు పార్టీకి మాత్రమే అన్ని వర్గాల, కులాల ఓట్లు అడిగే దమ్ముందన్నారు.
వచ్చే సాగర్ ఉప ఎన్నికల్లో మహా జన సోషలిస్టు పార్టీకే ఓటు వేయాలని మంద కృష్ణ కోరారు. పోరాటాలతో ప్రజలకు చేరువైన మహా జన సోషలిస్టు పార్టీకి మాత్రమే అన్ని వర్గాల, కులాల ఓట్లు అడిగే దమ్ముందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇప్పటి వరకు కేసీఆర్ ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు కూడా ఇవ్వలేదని.. ఇవన్నీ తెరాస మోసాలు కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: అనిశా వలలో గిడ్డంగుల సంస్థ జనరల్ మేనేజర్