రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్గొండ డిపోలో సమ్మె చేస్తున్న కార్మికులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మద్దతు తెలిపారు. ఆరు గంటల్లో కార్మికులు విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల విధులు బహిష్కరించి సకల జనుల సమ్మె చేస్తే... సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగాలు పీకేస్తానంటున్నాడని విమర్శించారు.
ఇదీ చూడండి : సమ్మెకు ప్రభుత్వమే కారణం: అశ్వత్థామరెడ్డి