ETV Bharat / state

సీఎం స్ఫూర్తితో ఆసుపత్రులను సందర్శిస్తున్నాం: ఎంపీ బడుగుల - మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఎంపీ బడుగుల లింగయ్య

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సందర్శించారు. కరోనా బాధితుల్లో మనోధైర్యం నింపారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సపై ఆరా తీశారు.

mla
mla
author img

By

Published : May 23, 2021, 4:00 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని సందర్శించి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించి వారికి అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

సీఎం కేసీఆర్​ను ఆదర్శంగా తీసుకొని కరోనా పేషెంట్లకు భరోసానిస్తూ... మనోధైర్యం కల్పించడానికి ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్నామన్నారు. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్​లో రెండు నెలల్లో 911 మంది కరోనా రోగులు చికిత్స తీసుకున్నారని… వారిలో 25 మంది మాత్రమే చనిపోయారన్నారు.

ప్రస్తుతం 65 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మందులకు కొరతలేదన్నారు. త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కొవిడ్ పేషెంట్లకు నిరంతరం వైద్యం అందిస్తున్న డాక్టర్లను, ఆసుపత్రి సిబ్బందిని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.