ఆర్టీసీ సమ్మె వల్ల ఎవరు లాభపడ్డారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీపై సీఎం ముందే నిర్ణయం తీసుకుంటే కార్మికుల ప్రాణాలు పోయేవి కావన్నారు. సీఎం సమ్మెకు ముందో మాట తర్వాట ఓ మాట మాట్లాడారని ఆరోపించారు. ప్రభుత్వం ఒక చేత్తో నగదు ఇచ్చి.. మరో చేత్తో తీసుకుంటోందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని బెల్టుషాపులను వెంటనే ఎత్తివేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు తీవ్రనష్టం కలిగించేది మద్యం దుకాణాలేనని తెలిపారు. కరోనా కంటే భయంకరమైన వ్యాధి.. మద్యమేనని వ్యాఖ్యానించారు.
రైతుబంధు ఓ మంచి కార్యక్రమం అని కోమటిరెడ్డి ప్రశంసించారు. ఈ పథకం భూస్వాములు, పెద్దరైతులకు కూడా వర్తిస్తుందని.. కానీ నిజమైన పేదరైతులకే రైతు బంధు దక్కాలని కోరారు. రైతుబంధు కింద తన ఖాతాలో రూ.3 లక్షలు పడిందని వెల్లడించారు. తనలాంటి వ్యక్తులకు రైతుబంధు సాయం అవసరమా? అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చూడండి : 'రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం'