నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు శాసనసభ్యులు నోముల నర్సింహయ్య సాగు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం ఎడమ కాల్వకు ఖరీఫ్ పంట సాగులో భాగంగా నీరు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సాగర్ ఎడమ కాలువకు 500 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు. రాత్రి వరకు క్రమంగా నీటి విడుదల పెంచనున్నామని అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం ఎగువ నుంచి వరద క్రమంగా పెరుగుతూ ఉంది. సాగు నీరు వార బంది విధానంలో నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే నర్సింహయ్య
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు శాసనసభ్యులు నోముల నర్సింహయ్య సాగు నీటిని విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సాగర్ ఎడమ కాల్వకు 500 క్యూసెక్కుల సాగు నీటిని అధికారులు విడుదల చేశారు.