నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కొంపెల్లిలో అధిక వర్షాలకు దెబ్బ తిన్న పత్తి పంటలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి పరిశీలించారు. కోటి ముప్పై ఎకరాల రైతుల భూమికి నీరిచ్చామని గొప్పలు చెపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన పత్తికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో రైతులు వరి, పత్తి పంటపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన అన్నారు. సాధారణ వర్షపాతం కంటే భారీ వర్షాలు కురవడంతో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బ తిన్న పంట పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను పంపివ్వాలని ఆదేశించారు. సీసీఐ కేంద్రాలు సత్వరమే ప్రారంభించి పత్తి దళారుల నుంచి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు పంటల బీమా ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాలని కోరారు.
- ఇదీ చదవండి: 'బాగా పనిచేస్తే దుబ్బాక స్థానం కాంగ్రెస్‌దే'