పంటల్లో చీడపీడల నివారణకు రసాయన ఎరువులు ఎంతో అవసరం అవుతాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు (Mla Bhaskar rao) అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పెస్టిసైడ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దామరచర్ల ప్రాంతంలో రైతులు ఎక్కువగా మెట్ట పైర్లను సాగు చేస్తారని... పత్తి, మిరప, కంది వంటి పంటలను అధికంగా పండిస్తారని ఎమ్మెల్యే అన్నారు.
పంటల్లో చీడపీడల నివారణకు రసాయన ఎరువులు ఎంతో అవసరం అవుతాయన్న ఆయన దూర ప్రాంతాలకు వెళ్లి వాటిని రైతులు కొనుగోలు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండల కేంద్రంలో ఇలాంటి షాప్‌ను ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రయాణ ఖర్చులతో పాటు, క్రిమిసంహారక మందులు లభ్యమవుతాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నాగమణి, ఏవో కల్యాణ్, సర్పంచ్ అరుణ్, స్థానిక నాయకులు నారాయణరెడ్డి, వీర కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
KBC: కేబీసీలో దాదా, సెహ్వాగ్‌లకు కేటీఆర్‌పై ప్రశ్న.. అదేంటంటే..?