ETV Bharat / state

పాలేరు వాగుపై చెక్​డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన - పాలేరు వాగుపై చెక్​డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే భాస్కరరావు శంకుస్థాపన

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం బొమ్మకల్​లో ఎమ్మెల్యే భాస్కరరావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలోని పాలేరు వాగుపై నిర్మించనున్న చెక్​డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

చెక్​డ్యాం నిర్మాణానికి శంకస్థాపన
చెక్​డ్యాం నిర్మాణానికి శంకస్థాపన
author img

By

Published : May 9, 2021, 4:10 PM IST

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని పాలేరు వాగుపై నిర్మించనున్న చెక్​డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే భాస్కరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీటి పారుదల శాఖ ద్వారా రూ.3 కోట్ల 95 లక్షల 80 వేల నిధులను చెక్​డ్యాం నిర్మాణం కోసం మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ చెక్​డ్యాం నిర్మాణం వల్ల దాదాపు 700 ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే బొమ్మకల్, భీమనపల్లి, చర్లగూడెం పరిసర గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ చెక్​డ్యాం నిర్మాణం పూర్తైతే.. ఇక్కడి ప్రజల నీటి సమస్యలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైనది సృష్టిలోనే లేదు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.