తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు పంచాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని మిర్యాలగూడ పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కేశవనగర్లో ఆటోలో తరలిస్తున్న పది క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.
పేదలకు చెందాల్సిన బియ్యాన్ని వారిని మభ్యపెట్టి అక్రమంగా తరలిస్తున్నారని.. గతంలో పలుసార్లు కేసులు నమోదు చేసినా.. అక్రమ దందా ఆపలేదని పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేకంగా వ్యాపారాలు నిర్వహించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు.