నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని గాంధీ పార్కు వద్దనున్న కరోనా వ్యాక్సిన్ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఆందోళన నిర్వహించారు. పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా సమయంలోనూ విధులు నిర్వహించిన వారికి పనికి తగ్గ వేతనం ఇస్తామన్న సీఎం కేసీఆర్... ఇప్పుడు పీఆర్సీ అమలు చేయకపోవడం చాలా అన్యాయమని అన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వ పనులే చేస్తున్నామని తెలిపారు.
పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, అది చాలదన్నట్లు పనికి తగ్గ వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా ఒప్పంద కార్మికులుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీపికబురు అందించాలని కోరారు. పీఆర్సీని అమలు చేయకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య