Ktr Review on Nalgonda: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా నల్గొండ పట్టణాభివృద్ధికి కసరత్తు వేగవంతమైంది. తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలతో పాటు నల్గొండ పరిసర గ్రామాలు, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని మంగలపల్లి, ఎల్లారెడ్డిగూడెం, చెరువుగట్టు గ్రామాలను కలుపుతూ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - నుడా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ నల్గొండ పట్టణాభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి నుడా ఏర్పాటు ఉత్తర్వుల ప్రతి అందించారు.
పట్టణంలో రహదారుల విస్తరణకు రూ.84 కోట్లు, కూడళ్ల అభివృద్ధి కోసం మంజూరు చేసిన మరో రూ.4 కోట్లకు సంబంధించిన ఉత్తర్వులను ఇచ్చారు. రహదారులు, తాగునీటి సరఫరా, విద్యుత్ నిర్వహణ, పచ్చదనం, పార్కుల అభివృద్ధి, ఉదయ సముద్రం సుందరీకరణ వంటి కార్యక్రమాలపై చర్చించిన కేటీఆర్... పట్టణానికి సంబంధించి వాటర్, పవర్ ఆడిట్ చేయాలని సూచించారు. స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు రానున్న ఏడాది లోపు చేపట్టబోయే వివిధ కార్యక్రమాల జాబితాను అందించాలని ఆదేశించారు. ఇక నుంచి నిరంతరం సమీక్షిస్తానని స్పష్టం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: New Virus India: నియోకొవ్ వైరస్‌తో భారత్‌కు ముప్పు ఉందా?