నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా పెద్దవురా మండలం ఉరబాయి తండాలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్, చిరుమూర్తి లింగయ్య, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్, తదితరులు పాల్గొన్నారు.
ఇక ముందు కూడా
దురదృష్టవశాత్తు నోముల నర్సింహయ్య అకాల మరణం చెందడం వల్ల.. ఈ ఉప ఎన్నికలు వచ్చాయని జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన వారసునిగా నోముల కుమారుడు భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జానారెడ్డి ఇన్నాళ్లు చేసింది ఏమీ లేదని.. ఇక ముందు కూడా చేయడని ఎద్దేవా చేశారు. జానారెడ్డి ఏనాడు తండాల వైపు తొంగి చూసి గిరిజనుల బాధలు పట్టించుకోలేదని విమర్శించారు.
నిరంతర అభివృద్ధికై..
మే నెల నుంచి అర్హులైన లబ్ధిదారులు అందరికి రేషన్ కార్డు, పింఛన్లు వస్తాయని మంత్రి అన్నారు. దీపం బుడ్ల వెలుతురు నుంచి నిరంతర విద్యుత్ సరఫరా వైపు మళ్లామని పేర్కొన్నారు. సాగర్ నిరంతర అభివృద్ధికై భగత్‌ను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి : 'రాష్ట్రం కోసం జానారెడ్డి సీఎం పదవిని త్యాగం చేశారు'