నాగార్జున సాగర్ జలాశయoలో 27 లక్షల చేప పిల్లలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విడుదల చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఆయన పర్యటించారు. అనంతరం నందికొండ పురపాలక పైలాన్, హిల్ కాలనీ బస్టాండ్, గాంధీ బజార్, వివిధ వార్డుల్లో మంత్రి పర్యటించి... సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల సమస్య, తాగు నీటి, పారిశుద్ధ్య సమస్యలు మంత్రి దృష్టికి తీసుకురాగా... అతి త్వరలో అన్ని సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధితో పాటు గ్రామీణాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులను ప్రోత్సాహిస్తూ... వారి జీవనోపాధికి ఉచిత చేప పిల్లలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ చిన్నపు రెడ్డి, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అమితాబ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన రష్మిక!