నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 14వ మైలు వద్ద రేపు జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య పరిశీలించారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో 6 లిఫ్ట్ పథకాలను సీఎం ప్రాంభించనున్నారు. అనంతరం జిల్లా ప్రజల కోసం ధన్యవాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.
ఈ ధన్యవాద సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరు అయ్యే అవకాశం ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ధన్యవాద సభలో ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, రాష్ట్ర నాయకులు అధికారులు ఉన్నారు.